Oct 28, 2024, 04:10 IST/
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
Oct 28, 2024, 04:10 IST
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. మన్నూరు గ్రామానికి చెందిన కృష్ణమ్మ, మణి దంపతులకు సుశాంత్ అనే కొడుకు ఉన్నాడు. నిన్న ఆదివారం చికెన్ వండారు. పొరపాటున కింద పడ్డ చికెన్ ముక్కను సుశాంత్ తినేందుకు యత్నించాడు. దాంతో ఆ చికెన్ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుంది. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడం వల్లే చిన్నారి సుశాంత్ మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు.