ఎల్కారంలో ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆందోళన కారులు ప్రత్యర్థుల ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో హై టెన్షన్ నెలకొంది. నిరసనకారుల ఆందోళనతో గ్రామంలో వారం రోజులుగా పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.