స్వాతంత్య్రం ఎవరికి వచ్చింది: న్యూ డెమోక్రసీ

266చూసినవారు
స్వాతంత్య్రం ఎవరికి వచ్చింది: న్యూ డెమోక్రసీ
న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విక్రమ్ భవణంలో జరిగిన సమావేశంలో న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ..రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు ఎక్కడ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారో,ఎక్కడ ప్రజలు నిర్భయంగా తలఎత్తుకొని నిలబడుతారో,అక్కడ స్వతంత్య్రంఉన్నట్లు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వచ్చినప్పుడే అసలైన స్వాతంత్య్రం అని గాంధీజీ అన్నాడు కానీ ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న, అత్యాచారాలు, అవమానాలు,వేదింపులు ఆగలేదు,ఆకలి చావులు ,రైతన్నల ఆత్మ అత్యలు ఆగలేదు,దళిత బహుజనులు,మైనార్టీలపై దాడులు ఆగలేదు,ప్రశ్నించే మేధావులు,ప్రజాస్వామ్య వాదులు విప్లవకారులపై నిర్బందాలు,అక్రమ అరెస్టులు,బూటకపు ఎన్కౌంటర్ల్ ఆగలేదు.రోజు రోజుకి 90 శాతం ప్రజలు అభద్రతతో బ్రతుకుతున్నారు.యువతకు ఉద్యగాలు, ఉపాధి లేక నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కొంతమంది పెడదారి పడుతున్నారు,విద్య,వైద్యం ,ప్రభుత్వ రంగాలను ,ప్రేవేట్,కార్పొరేట్, బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతున్నారు.అంబెడ్కర్ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. దీన్ని స్వాతంత్య్రం అంటారా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.ఇకనైనా అల్లూరి,భాగతసింగ్, ఆజాద్ ఆశయాలతో మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ రేణుక,పీడీఎస్ యు నాయకులు అఖిల్, రామన్న, రామోజీ,రాజేష్,జంగిర్, పవన్,లింగన్న తదితరులు పాల్గొన్నారు