మండలంలో విద్యరంగా, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి యామ రమేష్ లు అన్నారు. సోమవారం సూర్యాపేట మండలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల విద్యాధికారి శేషుగాని శ్రీనివాస్ గౌడ్ ను అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో , రాష్ట్ర బాధ్యులు లింగంపల్లి హరిప్రసాద్, రామినేని శ్రీనివాస్, బైరు తిరుమలేష్ ఉన్నారు.