భారత భవితవ్యం అంగన్వాడీ టీచర్ల చేతుల్లో ఉందని.. జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ తెలిపారు. గురువారం సూర్యాపేటలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సూర్యపేట అర్బన్ వారు పోషణ అభియాన్ లో భాగంగా పోషణ మాసం ప్రాజెక్టు లెవెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందించే పౌష్టిక ఆహారం వారు నేర్పే బోధన వల్ల భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండి అన్నింటిలో పోటీపడతారని కలెక్టర్ తెలిపారు.