మహిళల, విద్యార్ధినుల రక్షణలో జిల్లాలో షీ టీమ్స్ పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారని, వేదింపులకు గురవుతున్న మహిళలు, విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాలు, కళాశాలలు, బస్టాండ్ ప్రాంతాల్లో షీ టీమ్స్ సంచరిస్తూ వేదింపులకు పాల్పడుతున్న ఆకతాయిలపై నిఘా పెట్టామన్నారు.