సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సంక్షేమ హాస్టల్ విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని వాళ్లకి నాణ్యమైన విద్య ఆరోగ్యం పటిష్టంగా అందించాలని కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.