Sep 26, 2024, 06:09 IST/
భారీ వర్షాలు.. డ్రెయిన్‌లో పడి 45 ఏళ్ల మహిళ మృతి (వీడియో)
Sep 26, 2024, 06:09 IST
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంధేరీలోని MIDC ప్రాంతంలోని ఓపెన్ డ్రెయిన్‌లో 45 ఏళ్ల మహిళ పడి చనిపోయింది. బుధవారం రాత్రి 9:20 గంటలకు ఈ సంఘటన జరిగిందని BMC అధికారులు తెలిపారు. మహిళను విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు. ముంబై అగ్నిమాపక దళం ఆమెను వెళికి తీసి ఆసుపత్రికి పంపగా, అప్పటికే మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.