అనుమానాస్పద రీతిలో దంపతులు మృతి చెందారు. ఈ తీవ్ర విషాద ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. శాంతినగర్‌కు చెందిన ముదాం వెంకటేశ్ (40), వసంత (36) పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద విగతజీవులుగా కనిపించారు. భార్యను కట్టెతో కొట్టి చంపి ఆ తర్వాత వెంకటేశ్ పురుగు మందుతాగినట్లు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరికి కుమార్తె వర్షిణి, కుమారుడు అజిత్ ఉన్నారు.