బాలీవుడ్‌పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మరాఠీ, బోజ్‌పురి, బిహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారని, ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవని అన్నారు. ఒక వేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో ఫెయిల్ అయితే.. ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశం ఉందన్నారు.