ఆరోగ్య బీమాలపై జీఎస్టీని తొలగించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాసిన లేఖపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈక్రమంలో దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో స్పందించారు. జీఎస్టీని ప్రవేశపెట్టకముందు కూడా వైద్య బీమాపై పన్ను ఉండేదని ఆమె గుర్తు చేశారు. ఇదేమీ కొత్త అంశం కాదని, ఇక్కడ నిరసనలు తెలుపుతున్న వారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగించడంపై ఎప్పుడైనా చర్చించారా? అని ఆమె ప్రశ్నించారు.