సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి అమెరికాలో మరణించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి అమెరికాలో మృతిచెందాడు. దీంతో సొంత ఊరులో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రవీణ్ స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయినట్లు చెబుతున్నారు. ప్రవీణ్ ఐదు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. అతను యూఎస్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని సమాచారం.