BRS కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ MLC, తెలంగాణ వాది ప్రొ. శ్రీనివాస్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. 'ఇది కేవలం నాకు జరిగిన సత్కారమే కాదు.. నాలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారం. తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఉద్యమ రథ సారథి, తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్. వారి వద్ద 25 ఏండ్ల పాటు పనిచేయడం నా అదృష్టం. కేసీఆర్ లేనిది తెలంగాణ రాకపోయేది. ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతం' అని కొనియాడారు.