సెలరీ అనేది అపియేసి కుటుంబానికి చెందిన ఆకుకూర. ఇది అచ్చం కొత్తిమీరలా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి దీని జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సెలరీలో విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్‌ని తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి పెరుగుతుంది. అల్సర్, జీర్ణ సమస్యల వంటి కడుపు సమస్యలు తగ్గుతాయి.