మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్‌కేసర్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్టకి వెళ్లొస్తుండగా డీసీఎం వాహనం హైవేపై పల్టీలు కొట్టింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లు ఉప్పునూతల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.