జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితాను విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. 'హైదరాబాద్‌లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. జిల్లాల నుంచి హైదరాబాద్ వలస వచ్చిన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. సగంలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేస్తాం. లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది' మీడియా సమావేశంలో వెల్లడించారు.