TG: వ్యక్తి దారుణ హత్య.. నిందితుని ఇంటికి నిప్పు

5372చూసినవారు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి(M) మేఘ్యానాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన లకావత్ వెంగల్ అనే వ్యక్తిని డిచ్పల్లి మండలంలోని సీఎంసీ హాస్పిటల్ సమీపంలో దుండగులు హత్య చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడిని పట్టుకుని విచారణ జరుపుతుండగా హత్యకేసులో నిందితులందరినీ పట్టుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ప్రధాన నిందితుడైన బిక్యా ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.