TG: బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు

75చూసినవారు
TG: బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు
సంగారెడ్డి జిల్లా నిజాంపేట (M) ఖానాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు.. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దుర్గమ్మ(60)తో మహేష్ (26) గొడవ పడ్డాడు. అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేశాడు. బంగారు గుండ్లు తీసుకొని మనవడు మహేష్ పరారయ్యాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్