భద్రాచలంలోని గోదావరిలో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సీతారామచంద్రస్వామివారి ఆలయం సమీపంలోని గోదావరిలో హైదరాబాద్కు చెందిన చలపతి (25) తన స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగారు. ఇది గమనించిన గౌతమి ఘాట్ ఫొటోగ్రాఫర్లు.. నీటిలో మునిగిపోతున్న ఇద్దరిని కాపాడారు. మరో యువకుడు చలపతి గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపు చేపట్టారు.