తెలంగాణలో రైతుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోనే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, ప్రభుత్వం 800 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులకు ఇంకా డబ్బులు చెల్లించలేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు లేవని, రైతులకు టార్పాలిన్లు లేవని ఫైర్ అయ్యారు.