‘ప్రస్తుత ఎన్నికలు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు’

53చూసినవారు
‘ప్రస్తుత ఎన్నికలు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు’
తనను దేవుడే పంపాడంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పేదలకు కాకుండా, ఓ వ్యాపారవేత్తకు సాయం చేసేందుకే ఆయన వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఎన్నికలు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు. ఒకవైపు ‘ఇండియా’ కూటమి, రాజ్యాంగం ఉన్నాయి. మరోవైపు దాన్ని నాశనం చేయాలని భావిస్తున్నవారు ఉన్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని తెలిపారు.