పాన్‌, ఆధార్‌ అనుసంధానానికి ముగుస్తున్న గడువు

81చూసినవారు
పాన్‌, ఆధార్‌ అనుసంధానానికి ముగుస్తున్న గడువు
పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం తమ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. దీనికి ఇప్పటికే గడువు ముగిసింది. అయితే ఇప్పటికీ అనుసంధానం చేయనివారు రూ.1,000 జరిమానాతో 2024 మే 31 వరకు చేసుకునే అవకాశం ఉంది. లేనిపక్షంలో 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/పన్ను చెల్లింపులు ఉంటాయి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’పై క్లిక్‌ చేసి మీ వివరాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్