ద్వీప దేశానికి భారత్‌ ఆర్థిక సాయం

64చూసినవారు
ద్వీప దేశానికి భారత్‌ ఆర్థిక సాయం
నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశం పాపువా న్యూ గినియాలో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని పోర్ట్‌మోర్స్‌బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్‌లోని కవోకలామ్‌ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మంది సజీవ సమాధయ్యారు. దీంతో తక్షణ సాయం కింద 1 మిలియన్‌ డాలర్లు భారత్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్