క్విట్ ఇండియా ఉద్యమ భయంతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్స్‌తో పాటు భారతీయ వ్యాపారవేత్తలు కూడా దీనికి వ్యతిరేకంగా బ్రిటిష్ గవర్నమెంట్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విధంగా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ ఉద్యమానికి గుర్తుగా 1992లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్క రూపాయి స్మారక నాణేన్ని జారీ చేయడం విశేషం.