హెలికాప్టర్ ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడింది. ఈ హెలికాప్టర్ కేదార్నాథ్లో ఇటీవల ల్యాండింగ్ సమయంలో దెబ్బతింది. దీంతో దీన్ని తరలించేందుకు ఎంఐ-17 ఛాపర్ ను తీసుకొచ్చారు. ఈ ఛాపర్ కు కేబుల్స్ తో కట్టి తరలిస్తుండగా, తీగలు తెగి హెలికాప్టర్ కొండపై పడిపోయింది. జిల్లా టూరిజం అధికారి రాహుల్ చౌబే మాట్లాడుతూ.. "హెలికాప్టర్ బరువు, గాలి వల్ల ఎంఐ-17 బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో హెలికాప్టర్ థారు క్యాంపు సమీపంలో పడింది” అని చెప్పారు.