పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 26న జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉండనుంది. ఇక, డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదానికి పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.