నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో శనివారం కానిస్టేబుల్ రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా రవిశంకర్ విధులు నిర్వహిస్తున్నాడు. దీపావళి సెలవులు తీసుకుని కానిస్టేబుల్ నల్గొండకు వచ్చాడు. ఆత్మహత్యకు కారణాలపై నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.