ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విశాఖ కలెక్టరేట్లో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మెట్రో రైలు, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక తెస్తున్నామని ఆయన ప్రకటించారు. 10 పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామని స్పష్టం చేశారు. జీరో పావర్టీ దిశగా వేగంగా ముందుకెళ్లాలని అన్నారు.