ఇంటర్ కాలేజీలకు రేపటితో ముగియనున్న సెలవులు

72చూసినవారు
ఇంటర్ కాలేజీలకు రేపటితో ముగియనున్న సెలవులు
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు రేపటితో ఎండాకాలం సెలవులు ముగియనున్నాయి. దీంతో జూన్ 1న కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ కాలేజీలకు మార్చి 31 నుంచి ఇంటర్ బోర్డు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 12న తిరిగి తెరుచుకుంటాయి.