అన్నింటా అద్భుతాల్ని ఆవిష్కరించిన సాహిత్య రాజు అడవి బాపిరాజు

78చూసినవారు
అన్నింటా అద్భుతాల్ని ఆవిష్కరించిన సాహిత్య రాజు అడవి బాపిరాజు
లా డిగ్రీ పూర్తి చేసిన బాపిరాజు కొంతకాలం న్యాయవాదిగా సేవలందించారు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్ గా పనిచేశారు. అదే సమయంలో ఆయన కథలు రాశారు. 1939లో సినీరంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయము, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశారు. ఇంకా వీరి పాటల్లో, రచనల్లో, కథల్లో, చిత్ర వర్ణనలో ఒక్కో దాన్లో ఒక్కో విభిన్న కోణం ఉండేది. ఇలా అన్నింటా అద్భుతాల్ని ఆవిష్కరించిన సాహిత్య రాజు అడవి బాపిరాజు.

సంబంధిత పోస్ట్