వాల్మీకి 'రామాయణం' ఆధారంగా రూపొందించిన యానిమేటెడ్ చిత్రం 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా'. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ముక్కోటి ఏకదాశి సందర్భంగా విడుదల చేసింది. ఈ మూవీకి రామ్ మోహన్, కోయిచి ససాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మూవీ ఈనెల 24న విడుదల కానుంది. మూవీకి విజయేంద్ర ప్రసాద్ క్రియేటివ్ డైరెక్టర్, రచయితగా వ్యవహరించారు. 1993లోనే రూపొందించగా కొన్ని కారణాల వల్ల థియేటర్లలో ప్రదర్శించలేదు. ప్రస్తుతం 4K వెర్షన్‌లో విడదలు చేయనున్నారు.