కొనసాగుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ

55చూసినవారు
కొనసాగుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. మంగళవారం విద్యుత్ శాఖ అధికారి రఘు, ప్రొఫెసర్ కొదండరాం విచారణకు హాజరయ్యారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో విచారణ జరుగుతుంది. తక్కువ ధరకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అదనపు ధరలు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసినట్లు విచారణకు హాజరైన రఘు వెల్లడించారు.