TG: జలమండలి ఓటీఎస్ ఆఫర్ నేటితో ముగియనుంది. జలమండలికి రూ.1700 కోట్ల బకాయిలు ఉండంతో ఎలాంటి ఫైన్ లేకుండా బకాయిలు చెల్లించేలా అక్టోబర్లో వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది నవంబర్ 30తో ముగియగా ఈ రెండు నెలల్లో రూ.90 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. ఈ క్రమంలో పెండింగ్ బిల్లులు చెల్లించని వినియోగదారులపై రేపటి నుంచి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.