భార్యపై అసూయతో రోజూ 100కి పైగా అజ్ఞాత కాల్స్ చేస్తున్న భర్తను అరెస్టు చేసిన పోలీసులు

73చూసినవారు
భార్యపై అసూయతో రోజూ 100కి పైగా అజ్ఞాత కాల్స్ చేస్తున్న భర్తను అరెస్టు చేసిన పోలీసులు
జపాన్ లో ఒక వ్యక్తి తన భార్యకు అజ్ఞాత కాల్స్ చేస్తూ విసిగించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన భార్య ఇతరులతో ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుందనే అసూయతో రోజుకు 100కి పైగా కాల్స్ చేసేవాడని వార్తా కథనాలు తెలిపాయి. ఈ అనుమానాస్పద కాల్స్ పై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్తే ఇది చేస్తున్నాడని నిర్ధారించారు. ఈ మేరకు మహిళ ఫోన్ లిఫ్ట్ చేయగానే కట్ చేసేవాడని వారు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్