దీపావళి ముందొచ్చే ధనత్రయోదశి నాడు విలువైనవి కొనుగోలు చేసుకుంటే, సంపద మరింత పెరుగుతుందనేది నమ్మకం. గత ఏడాది ధన త్రయోదశి రోజున 999 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.61,200గా ఉంది. మంగళవారం ఈ ధర రూ.81,400. కిలో వెండి ధర రూ.74,000 నుంచి రూ.1,01,000కి చేరింది. శుభగడియలు ఇవాళ మధ్యాహ్నం 1:11 గంటల వరకు ఉన్నందున విక్రయాలు గతేడాదితో పోలిస్తే 10% తగ్గినా.. విలువ పరంగా 20%, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు’ అని విక్రేతలు అంచనా వేస్తున్నారు.