వైఎస్ ఆస్తుల వివాదంపై ఇక పార్టీ నుంచి ఎవరూ మాట్లాడవద్దని కోర్టులోనే వాదనలు వినిపిద్దామని వైసీపీ మూడు రోజుల కిందట ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో వైసీపీకి కొన్ని చిక్కులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జగన్ పులివెందుల పర్యటనకు వచ్చారు. అక్కడ కీలకమైన ప్రకటన చేసేందుకే వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయమ్మ లేఖపై స్పందించి ఆస్తుల వివాదాన్ని పరిష్కరించకుంటారా లేకపోతే.. తల్లి కూడా సోదరితో జత కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించి.. తన బాట తనదేనని చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.