ఆగస్టు 1 నుంచి 'చెప్పులు, షూ'ల రేట్లు పెరగబోతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ విడుదల ప్రకారం.. మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు కొత్త నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు కావాలి. BIS ప్రకారం.. మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు ఇకపై నూతన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు (QCO) ఆగస్టు 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.