ఇవాళ మధ్యాహ్నం 2.07 గంట‌ల‌కు ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ విడుద‌ల

56చూసినవారు
ఇవాళ మధ్యాహ్నం 2.07 గంట‌ల‌కు ‘దేవర’ రిలీజ్ ట్రైలర్ విడుద‌ల
ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ‘దేవ‌ర‌’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా రిలీజ్‌ ట్రైల‌ర్‌ను ఇవాళ ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని చిత్రబృందం శనివారం ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల ఆలస్యం అవుతుందని పేర్కొంటూ ఆదివారం ట్వీట్‌ పెట్టింది. నేటి మధ్యాహ్నం 2.07 గంట‌ల‌కు ట్రైలర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌కటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్