ప్రపంచ ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్ఎక్స్' నిర్మించి ప్రయోగించిన
బాహుబలి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం దక్షిణ టెక్సాస్ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగించిన ఎనిమిది నిమిషాల్లోనే రాకెట్ సిగ్నల్స్ కోల్పోవడం వల్ల లోపల జంట పేలుళ్లు సంభవించాయని స్పేస్ఎక్స్ ప్రకటించింది. దీంతో రెండోసారి కూడా స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైనట్లయింది. ఇక 400 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ 'స్టార్‌షిప్' రాకెట్ ప్రపంచంలోనే అతిపెద్ద లాంఛ్ వెహికిల్ అని స్పేస్ఎక్స్ ప్రకటించింది.