అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం హోరాహోరీగా పోటీ పడిన తర్వాత 2024 ఒలింపిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా పారిస్ నేషనల్ స్టేడియంలో 70వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ ముగింపు వేడుకలు జరిగాయి. భారత్ తరపున మను బాకర్, పీఆర్ శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు. ఒలింపిక్ ఫ్లాగ్‌ను లాస్ ఏంజెలిస్ కు అందజేశారు.