హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి డైరెక్షన్ వచ్చిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ మూవీ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు ఫ్యామిలీ, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ పాల్గొన్నారు.