TG: పెళ్లి బారాత్ ఓ మహిళ ప్రాణం తీసింది. కరీంనగర్(D) శంకరపట్నం(M) మెట్‌పల్లికి చెందిన బకారపు ప్రభాకర్ కుమార్తె నవ్య పెళ్లి తర్వాత బారాత్ నిర్వహించారు. ఈ సమయంలో డ్రైవర్‌కు ఫోన్ రావడంతో కారు దిగి పక్కకు వెళ్లాడు. పెళ్లికొడుకు అశోక్ నడపడంతో డ్యాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో బకారపు ఉమ (35), ఆమె కుమార్తె నిఖితతో పాటు పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఉమకు స్థానికంగా చికిత్స అందించి HYD తరలిస్తుండగా మృతి చెందింది.