తెలంగాణలో దారుణ సంఘటన జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డులోని పార్కులో ఆడుకుంటున్న మూడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం యత్నం చేశాడు. ప్రధాన రహదారిపై ఉన్న ఒక పెద్ద హోటల్లో పనిచేస్తున్న ఓ యువకుడు పార్కులో ఆడుకుంటున్న మూడేళ్ల పసిపాపను పక్కకు లాక్కుని వెళ్లి అత్యాచారం చేస్తుండగా.. గమనించిన స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.