'ఫుష్ప-2' ప్రీమియర్ షో ఘటన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇకపై ఏ చిత్రాలకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రకటించారు. అలాగే ఏ చిత్రాలకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.