ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అశోక్ బాబు ఫైరయ్యారు. గతంలో అమరావతిలో జగన్ దాష్టీకాలు సృష్టించారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయాలనేది ప్రజల మనోభావమని, అమరావతి ఉద్యమాన్ని 1600 రోజులపాటు కొనసాగించారని గుర్తుచేశారు. అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తే చెల్లదని జగన్ గుర్తించాలని హితవు పలికారు. గత పాలనలో రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు రాలేదని, ప్రస్తుతం రూ.6 వేల కోట్లకు పైగా రుణం మంజూరు చేస్తోందని తెలిపారు.