జ్వరం వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అయితే ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ కొన్ని వయసుల వారికి అసలు మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. 65ఏళ్లు పైబడిన వారు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల గుండె జబ్బు, కడుపులో మంట, మోకాళ్లకు సంబంధించిన వ్యాధులు వస్తాయని ఓ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు.