మితిమీరిన కోపం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి. రాశిచక్ర ఫలితాలు కూడా వారి స్వభావంపై ఆధార పడి ఉంటాయి. మేషం నుండి మీనం వరకు, అన్ని రాశిచక్ర గుర్తులను పాలించే గ్రహాలు భిన్నంగా ఉంటాయి. పాలించే గ్రహం ప్రభావం వల్ల అన్ని రాశుల వారి స్వభావాలు, వ్యక్తిత్వం భిన్నంగా ఉంటాయి. కొన్ని రాశుల వ్యక్తులు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. కొన్ని రాశి చక్రాల ప్రజలు చాలా కోపంగా ఉంటారు. ఇలా ఎక్కువ కోపంగా ఉండే కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభం: ఈ రాశిలో పుట్టిన వారికి చాలా త్వరగా కోపం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరి దృష్టికి ఏదైనా చెడుగా అనిపించినప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. కోపాన్ని ఏ మాత్రం అదుపు చేసుకోలేరు. వారిని అదుపు చేయడం కూడా చాలా కష్టసాధ్యం. కోపంలో కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. వాటి ఫలితం పట్ల తర్వాత చింతిస్తారు. అయితే తమ తప్పులను ఏ మాత్రం ఒప్పుకునే స్వభావం వీరికి ఉండదు.
వృశ్చికం: వీరికి కట్టలు తెంచుకోలేని కోపం వస్తుంటుంది. వీరిని కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కోసం వస్తే ఎవరినైనా తిడతారు. ఇక ప్రేమ వ్యవహారం అయితే వీరిని అదుపు చేయడం అసాధ్యం. ఇలాంటి వారికి వీలైనంద దూరంగా ఉంటే మంచిది.
సింహం: హఠాత్తుగా ఈ రాశి వారికి కోపం వచ్చేస్తుంది. కోపంలో ఎలా ప్రవర్తిస్తారో వీరికే తెలియదు. కోపంలో చాలా హద్దులు దాటేస్తారు. అయితే ఆ తప్పులను అంగీకరించే స్వభావం ఉండదు. ఇలాంటి స్వభావం ఉన్నవారికి వీలైనంత దూరం పాటించాలి.
కన్య: ఈ రాశి వారితో మాట్లాడే సమయంలో ఆలోచించి ముందడుగు వేయాలి. వీరు చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఎదుటి వారిని అనరాని మాటలు అంటారు. తర్వాత ఏ మాత్రం పశ్చాత్తాప పడరు.