జూనియర్ డాక్టర్లతో సమావేశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేప్-హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం చేసేందుకు, విచారణను వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన సహాయం అందజేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు నలుగురు సీనియర్ పోలీసు, ఆరోగ్య అధికారులను విధుల్లో నుంచి తొలగించింది. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఆస్పత్రుల్లో భద్రతా చర్యల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనుంది.