భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెలరోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా తయారు చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.