ఏపీలో మూడు రోజులు వర్షాలు

54చూసినవారు
ఏపీలో మూడు రోజులు వర్షాలు
AP: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంతూళ్ల ప్రయాణాల్లో ప్రజలు బిజిబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. కాగా, నెల్లూరులో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్